హదిత పోర్ట్ ద్వారా స్మగ్లింగ్...63,000 క్యాప్‌గాన్ టాబ్లెట్స్ సీజ్
- March 04, 2024
రియాద్: హదిత పోర్ట్ ద్వారా 63,000 క్యాప్‌గాన్ మాత్రలను అక్రమంగా తరలించడానికి చేసిన రెండు ప్రయత్నాలను జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) అడ్డుకుంది. సౌదీ అరేబియాలోకి ప్రవేశించే రెండు వాహనాల్లో దాచిన నిషిద్ధ వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. మొదటి కేసులో వాహనం యొక్క వివిధ భాగాలలో దాచిన 41,279 క్యాప్టాగన్ మాత్రలను గుర్తించారు. రెండో ప్రయత్నంలో పోర్టుకు వచ్చే మరో వాహనంలో ఇదే పద్ధతిలో దాచిన 22,000 మాత్రలను గుర్తించి సీజ్ చేశారు. ఈ కేసులకు సంబంధించి ఐదుగురు వ్యక్తుల అరెస్టు చేసినట్లు అథారిటీ తెలిపింది. స్మగ్లింగ్ కార్యకలాపాల సమాచారాన్ని భద్రతా హాట్‌లైన్ (1910), ఇమెయిల్ ([email protected]) లేదా అంతర్జాతీయ నంబర్ (00966114208417) ద్వారా తెలపాలని కోరింది. సరైన సమాచారాన్ని అందజేసిన వారికి రివార్డ్క ఇస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!