ITB బెర్లిన్ సదస్సులో ఒమన్ పెవిలియన్ ప్రారంభం

- March 06, 2024 , by Maagulf
ITB బెర్లిన్ సదస్సులో ఒమన్ పెవిలియన్ ప్రారంభం

బెర్లిన్: ITB బెర్లిన్ 2024లో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పెవిలియన్ మంగళవారం ప్రారంభించారు. ఇందులో సుమారు 70 కంపెనీలు మరియు పర్యాటక, హోటల్ సంస్థలు పాల్గొంటున్నాయి.  ఒమన్ పెవిలియన్ లో పర్యాటక ఆకర్షణలు, వివిధ గవర్నరేట్‌లలో ఉన్న ల్యాండ్‌మార్క్‌లు. ఇన్‌బౌండ్ సందర్శకులకు ట్రావెల్ మరియు టూరిజం కంపెనీలు అందించే సేవలను ప్రదర్శిస్తున్నారు. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (SMEలు) సంబంధిత ఉత్పత్తులతో పాటు అడ్వెంచర్ టూరిజం, ఒమానీ క‌లిన‌రీ కళల కోసం పెవిలియన్‌లో ప్ర‌త్యేక‌ గ్యాలరీలను కేటాయించారు. బెర్లిన్ మేయర్ కై వెంగర్ ఆధ్వర్యంలో ఒమానీ పెవిలియన్ ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రి సలీం మహ్మద్ అల్ మహ్రూఖీ, హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అజాన్ ఖాసిమ్ అల్ బుసాయిదీ, జర్మనీలో ఒమన్ రాయబారి మైతా సైఫ్ అల్ మహ్రూఖీ పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా హెరిటేజ్ మరియు టూరిజం మంత్రి మాట్లాడుతూ.. ITB బెర్లిన్‌లో ఒమన్ సుల్తానేట్ పాల్గొనడం వల్ల జర్మన్ మార్కెట్ నుండి దేశాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య 15-20% పెరుగుతుందని తెలిపారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com