కడుపు ఉబ్బరంగా, పట్టేసినట్లుందా.?
- March 06, 2024కొన్ని సమస్యలకు కొన్ని ఇంటి చిట్కాలు బాగా పని చేస్తాయ్. వాటిని కొట్టి పారేస్తూ.. ఇంగ్లీష్ మందులతో కాలక్షేపం చేద్దామనుకుంటే, ఆ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్టుల్ని సైతం భరించాల్సి వస్తుంది.
ముఖ్యంగా గ్యాస్ సమస్యలు ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్యలో ఒకటి. చిన్నా పెద్దా తేడా లేదు.. అందరికీ గ్యాప్ నొప్పి. కడుపు ఉబ్బరం..!
ఈ సమస్యని తాత్కాలికంగా పోగొట్టుకునేందుకు ఈనో వంటి మందులు అందుబాటులో వున్నాయ్. అలాగే రిఫ్లెక్స్ ఫోర్ట్ తదితర మందుల వాడకం కూడా విరివిగా జరుగుతోంది.
కానీ, వీటన్నింటి కంటే మంచి ఔషధం. మన వంటింటి పోపుల బాక్స్‌లో వుండే వాము. వాముకు ఆయుర్వేదంలో మంచి ప్రాధాన్యత వుంది. అజీర్ణ సమస్యలు తీర్చడంలో వాముది ప్రత్యేకమైన స్థానం.
రాక్ సాల్ట్‌తో కలిపి కొద్దిగా వామును తీసుకుని బాగా దంచి నోటిలో వుంచి దాని రసాన్ని మింగుతూ వుంటే.. కడుపు పట్టేసినట్లుండడం నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని తర్వాత కొద్దిగా గోరు వెచ్చని నీటిని తాగాలి. దాంతో, త్రేన్పులు వచ్చి తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. పొట్ట ఖాళీ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
ఇలా చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రావు సరి కదా.. మళ్లీ మళ్లీ అజీర్తి సమస్యలు రాకుండా వుండాలంటే.. ప్రతీరోజూ కొద్దిగా వాముని రాక్ సాల్ట్‌తో కలిపి తీసుకోవడం మంచిది. లేదంటే, మరిగించిన వాటర్‌లో వాము వేసి, ఆ నీటిని పరగడుపున తీసుకున్నా అజీర్తి సమస్యలు క్రమ క్రమంగా మాయమైపోతాయని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..