మహిళా దినోత్సం ముందు రోజున అక్కచెల్లెమ్మలకు ఆర్థికసాయం: సిఎం జగన్‌

- March 07, 2024 , by Maagulf
మహిళా దినోత్సం ముందు రోజున అక్కచెల్లెమ్మలకు ఆర్థికసాయం: సిఎం జగన్‌

అమరావతి: అనకాపల్లి జిల్లా పిసినికాడ వద్ద ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ నాలుగో విడత వైఎస్‌ఆర్‌ చేయూత పథకం నిధులు విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.5,060.49 కోట్ల నగదు బదిలీ చేశారు. 45 నుంచి 60 ఏళ్ల వయసు గల 26,98,931 మంది మహిళల ఖాతాల్లోకి రూ.18,750 చొప్పున జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..చేయూత పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.75 వేలు ఇస్తున్నామని చెప్పారు. మహిళా దినోత్సం ముందు రోజున అక్కచెల్లెమ్మలకు ఆర్థికసాయం చేయడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. తమ ఐదేళ్ల పాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశామని చెప్పారు. ఇవాళ్టి నుంచి 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతుందని సీఎం జగన్ వివరించారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్థికసాయం అందిస్తూ అక్కచెల్లెమ్మలను ఆదుకుంటున్నామని, అందుకు తాను గర్విస్తున్నానని తెలిపారు. వైఎస్‌ఆర్ చేయూత పథకాన్ని ఏపీ ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ప్రారంభించింది. గత మూడు విడతల్లో ఒక్కొక్క మహిళకు రూ.56,250 మేర లబ్ధి చేకూరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com