20 శాతం తగ్గనున్న ఉల్లిపాయల ధరలు..!

- March 07, 2024 , by Maagulf
20 శాతం తగ్గనున్న ఉల్లిపాయల ధరలు..!

యూఏఈ: ఎగుమతులపై మూడు నెలల నిషేధం తర్వాత యూఏఈకి కమోడిటీ ఎగుమతులను భారతదేశం అనుమతించింది. దీంతో యూఏఈలో ఉల్లి ధరలు 20 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా 2023 డిసెంబర్ 8న  ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం విధించింది.   "నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ద్వారా యూఏఈకి త్రైమాసికానికి 3,600 మెట్రిక్ టన్నుల పరిమాణపు సీలింగ్‌తో 14,400 టన్నుల ఉల్లిపాయల ఎగుమతి అవుతాయి. " అని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియా నిషేధం విధించిన తరువాత యూఏఈలో ఉల్లిపాయల ధరలు కిలోకు సగటున 1.5-Dh2 నుండి దాదాపు Dh7-Dh8కి పెరిగాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com