SR460 బిలియన్లకు చేరిన సౌదీ డిజిటల్ ఎకానమీ
- March 07, 2024
రియాద్: సౌదీ అరేబియా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని సాధించిందని, దాని విలువ సుమారు SR460 బిలియన్లకు ($122.65 బిలియన్లు) చేరుకుందని సౌదీ కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అబ్దుల్లా అల్-స్వాహా ప్రకటించారు. రియాద్‌లో జరిగిన లీప్ టెక్ కాన్ఫరెన్స్ 2024 సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కింగ్డమ్ విజన్ 2030 ప్రారంభించినప్పటి నుండి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సుమారు 10 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. కింగ్డమ్ టెక్నాలజీ, డిజిటల్ మార్కెట్ SR183 బిలియన్ల ($48.7 బిలియన్లు) కంటే ఎక్కువగా పెరిగిందని అల్-స్వాహా చెప్పారు. ఈ సదస్సు ద్వారా 11.9 బిలియన్ డాలర్ల సాంకేతిక పెట్టుబడులు వస్తాయని సోమవారం తన ప్రారంభ ప్రసంగంలో అల్-స్వాహా వెల్లడించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఐబీఎం, డేటావోల్ట్ మరియు సర్వీస్‌నౌ వంటి ప్రపంచ సాంకేతిక దిగ్గజాలతో ఒప్పందాలను ఈ సదస్సులో ప్రకటించారు.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒమన్‌లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







