కొన్ని కుటుంబాల లబ్ధి కోసమే జమ్మూకశ్మీర్‌ను సంకెళ్లలో వేశారు: ప్రధాని మోడీ
- March 07, 2024
శ్రీనగర్: రోజు శ్రీనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఆంక్షల నుంచి స్వేచ్ఛ దొరికిందన్నారు. ఎన్నో దశాబ్ధాలుగా రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్ష పార్టీలు 370 ఆర్టికల్ పేరుతో జమ్మూకశ్మీర్ ప్రజల్ని, దేశాన్ని తప్పుదోవ పట్టించాయని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 370 నుంచి జమ్మూకశ్మీర్ లబ్ధి పొందిందా, లేదా కొన్ని రాజకీయ కుటుంబాలు మాత్రమే లాభపడ్డాయా అని ఆయన ప్రశ్నించారు. తమను తప్పుదోవ పట్టించారన్న విషయాన్ని జమ్మూకశ్మీర్ ప్రజలు ఆలస్యంగా గ్రహించారని మోడీ పేర్కొన్నారు. కొన్ని కుటుంబాల లబ్ధి కోసమే జమ్మూకశ్మీర్‌ను సంకెళ్లలో వేసేశారన్నారు. ఇవాళ జమ్మూకశ్మీర్‌లో 370 లేదు అని, దీని వల్ల ఆ రాష్ట్ర యువత ప్రతిభకు గౌరవం దక్కుతోందని, ఫలితంగా కొత్త అవకాశాలు వస్తున్నట్లు మోడీ చెప్పారు. సమాన హక్కులు, సమాన అవకాశాలు లభిస్తున్నాయన్నారు.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒమన్‌లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







