హీరోగా సుహాస్ తగ్గేదే లే.!
- March 07, 2024
కమెడియన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నటుడు సుహాస్. బేస్ వాయిస్‌తో ఏ చిన్న పాత్ర చేసినా ఆ పాత్రకు తనదైన ప్రాధాన్యత అద్దుతుంటాడీ యంగ్‌స్టర్.
‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా తన స్టామినా చూపించాడు. హీరోలందు తన హీరోయిజం వేరయా.. అంటూ ప్రతీసారీ ఏదో ఒక కొత్త కాన్సెప్ట్‌తో వస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు.
హీరోగా తాను టచ్ చేసిన సబ్జెక్ట్‌తో సైలెంట్‌గా హిట్టు కొట్టుకెళ్లిపోతున్నాడు సుహాస్. వెరీ లేటెస్ట్‌గా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ లోపే మరో కొత్త సినిమా టీజర్ వదిలాడు సుహాస్.
‘ప్రసన్నవదనం’ అనే పద్దతైన టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలోనూ ఏదో కొత్త విషయం వుందని తెలుస్తోంది టీజర్ చూస్తుంటే.
ఈ సినిమాలో హీరోకి ‘ఫేస్ బ్లైండ్‌నెస్’ అనే ఓ వింత వ్యాధి వుంది. ముఖంలోని భాగాలైన ముక్కు, చెవులు, కళ్లు.. ఇలా అన్ని భాగాలూ విడి విడిగా కనిపిస్తాయ్. కానీ, ముఖాన్ని మాత్రం రికగ్నైజ్ చేయలేకపోవడమే ఈ వ్యాధి లక్షణం.
ఇటువంటి ఓ విచిత్రమైన వ్యాధి కారణంగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు మన హీరో ఎదుర్కోబోతున్నాడన్నదే ఈ సినిమా కథ. వెరీ ఇంట్రెస్టింగ్ కదా.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒమన్‌లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







