రాజావారు రాణి గారు ఒక్కటవుతున్నారు.!
- March 12, 2024
యంగ్‌స్టర్ కిరణ్ అబ్బవరం నటించిన తొలి సినిమా ‘రాజా వారు రాణివారు’. ఈ సినిమాతో పరిచయమైన ఈ కుర్రోడు సమ్‌థింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. సినిమా కూడా చిన్న సినిమా అయినా మంచి హిట్ అందుకుంది.
ఓ ఫీల్ గుడ్ సినిమా అనే ఫీల్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ కుర్రోడు వరుస పెట్టి అవకాశాలు దక్కించుకోవడం.. చాలా తక్కువ టైమ్‌లోనే యూత్ స్టార్‌గా సెన్సేషనల్ అయిపోవడం జరిగిపోయింది.
సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ సంగతి అటుంచితే.. తాజాగా మనోడు పెళ్లి కబురు చల్లగా చెప్పేశాడు.
ఇంతకీ పెళ్టి కూతురు ఎవరో అంటారా.? తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్. ‘రాజా వారు రాణి వారు’ సినిమా టైమ్ నుంచే కిరణ్ అబ్బవరం, రహస్య ప్రేమలో వున్నారట. ఆ ప్రేమ ముదిరి ముదిరి ఇప్పుడు పెళ్లి పీటల వరకూ చేరింది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు.
తాజాగా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యండిల్ ద్వారా వెల్లడించాడు కిరణ్ అబ్బవరం. దాంతో, అభిమానులు, సినీజనం, నెటిజనం.. ఈ జంటకు బెస్ట్ విషెస్ తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









