‘హనుమాన్’ ఏంటీ ఊరింపు.!
- March 12, 2024కేవలం 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా ‘హనుమాన్’. చిన్న సినిమాగా విడుదలై ఏకంగా 330 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అంతేకాదు, 50 రోజుల ధియేటర్ ఫంక్షన్ కూడా చేసుకుంది సక్సెస్ ఫుల్‌గా.
ఈ మధ్య ఏ సినిమా అయినా కేవలం ఓపెనింగ్స్‌కే పరిమితమైపోయింది. అంతగా కాదంటే.. కష్టపడి ఓ వారం రోజులు నిలవడం గగనమైపోయింది.
అలాంటిది ‘హనుమాన్’ 50 రోజులు సక్సెస్‌ఫుల్‌గా ధియేటర్లలో ప్రదర్శించబడింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమాని ఓటీటీలో మళ్లీ మళ్లీ చూడాలని ఎదురు చూస్తున్న వారు చాలా మంది వున్నారు.
కానీ, ఓటీటీ రిలీజ్‌పై ఇంకా డైలమా కొనసాగుతోంది. సంక్రాంతికి ‘హనుమాన్’తో రిలీజైన సినిమాలన్నీ ఓటీటీలోనూ రిలీజై తుస్సు మన్న టాక్ తెచ్చుకున్నాయ్.
కానీ, ‘హనుమాన్’ మాత్రం అదే ఇంటెన్షన్‌తో ఓటీటీ రిలీజ్ పైనా ఆసక్తి క్రియేట్ చేస్తోంది. మార్చి2న ఓటీటీలో హనుమాన్ రిలీజ్ అన్నారు. రాలేదు. శివరాత్రి సందర్భంగా మార్చి 8న పక్కా అంటూ ప్రచారం జరిగింది. అదీ కుదరలేదు.
తాజాగా ఓటీటీ రిలీజ్‌పై ఇంకా ఏ డేట్ ఫిక్స్ చేయలేదని ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న ఓటీటీ సంస్థ జీ 5 ఛానెల్ వాళ్లు ప్రకటించారు. చూస్తుంటే.. 100 డేస్ ఫంక్షన్ జరుపుకున్నాక కానీ, ఓటీటీలో ‘హనుమాన్’ వచ్చేలా కనిపించడం లేదు. ఏది ఏమైనా ఓ సినిమాని ఇష్టపడితే.. జనంలో ఆసక్తి ఈ విధంగా వుంటుంది.. అని ‘హనుమాన్’ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత