దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ ‘రమదాన్ వీక్లీ పాస్’
- March 12, 2024
దోహా: పవిత్ర రమదాన్ మాసం రావడంతో దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ కొత్త రమదాన్ వీక్లీ పాస్‌ను ప్రారంభించినట్లు ప్రకటించాయి. కేవలం QR30కి అపరిమిత రైడ్లను ఇది అందిస్తోంది. కొత్తగా విడుదల చేసిన పాస్ మార్చి 11 నుండి ఏప్రిల్ 11 వరకు అందుబాటులో ఉంటుంది. “ఈ రమదాన్ లో పట్టణంలోని ఈవెంట్లను సందర్శించేందుకు .. ముఖ్యంగా నైట్ బజార్ల నుండి ఇస్లామిక్ తరగతులు మరియు క్రీడా కార్యకలాపాల వరకు రమదాన్ వీక్లీ పాస్‌తో ఆనందించవచ్చు. కేవలం 30 QARతో 7 రోజుల పాటు అపరిమిత రైడ్లను ఆస్వాదించవచ్చు. అన్ని స్టేషన్లలోని ట్రావెల్ కార్డ్ వెండింగ్ మెషీన్ల నుండి వీటిని కొనుగోలు చేయవచ్చు. రమదాన్ సందర్భంగా మెట్రో మరియు ట్రామ్ సేవలను శనివారం నుండి గురువారం వరకు ఉదయం 6 నుండి 1 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుండి శుక్రవారం తెల్లవారుజామున 1 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ఖతార్ రైల్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..









