‘ఇండియన్ 2’ - ‘కల్కి’ పోరు తప్పదా.?
- March 12, 2024శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఇండియన్ 2’ని సమ్మర్ స్సెషల్‌గా మే లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే, అదే నెలలో మే 9న మరో భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి’ సినిమా కూడా రిలీజ్‌కి సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే.
అదే డేట్‌కి ఏది ఏమైనా ‘కల్కి’ని రిలీజ్ చేయాలంటూ పట్టు పట్టుకుని కూర్చున్నారు అశ్వనీదత్ అండ్ టీమ్. అయితే, సరిగ్గా అదే డేట్‌కి ‘ఇండియన్ 2’ కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ అదే జరిగితే, రెండు ప్యాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడాల్సి వస్తుంది. కానీ, అది సాధ్యమవుతుందా.? అంతే కాదు, ఈ రెండు సినిమాలూ కమల్ హాసన్ నటించినవే కావడం విశేషం.
‘కల్కి’ సినిమాలో ప్రబాస్ హీరోగా నటిస్తుండగా. పవర్ ఫుల్ విలన్ పాత్రలో కమల్ హాసన్ కనిపించబోతున్నారు. ఇక, ‘ఇండియన్ 2’ అనేది ఇటు కమల్ హాసన్‌కీ, అటు శంకర్‌కీ ఇద్దరికీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టే.
మరి, జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, ఒకవేళ అదే జరిగితే.. సినీ ప్రియులకి పండగే. కానీ, సాధ్యపడే అవకాశాలే చాలా తక్కువ. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్