పేషెంట్లు ఉపవాస దీక్షకు ముందు వైద్యుల సలహా తీసుకోవాలి
- June 30, 2015
ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారు లేదా దీర్ఘకాలంగా చికిత్స తీసుకుంటున్నవారు, రమదాన్ ఉపవాస దీక్షకు కు ఉపక్రమించేముందు వైద్యుల అనుమతి తీసుకోవడం అవసరమని వైద్య నిపుణులు తెలియచేశారు. ఒమాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు - సాధారణంగా లివర్ సిర్రొసిస్, కిడ్నీ ఫెయిల్యుర్ వంటి రుగ్మతలు లేదా దీర్ఘకాలంగా చికిత్సలో ఉన్న రకాల పేషం ట్లకు వైద్య కారణాల వలన మినహాయింపు ఉన్నదని తెలిపారు. ఐనప్పటికీ, ప్రతిఒక్కరి ఆరోగ్యం భిన్నమైనదనీ, అటువంటి వారు డాక్టర్ ను సంప్రదించాలని ఆరోగ్య శాఖ ఫ్యామిలీ మెడిసిన్ యొక్క సేనియర్ కన్సల్టంటు డా. అహ్మెద్ హమేద్ అల్ వహైదీ తెలిపారు. అల్ రఫ్ఫా హాస్పి టల్ న్యూట్రిషనిస్టు మరియు వేయిట్ లాస్ కన్సల్టంటు ఐన మోనికా సేథ్, ఉపవాస దీక్ష వారి వ్యక్తిగత మత నమ్మకానికి చెందినదైనప్పటికీ, కొన్ని రకాల వైద్యపరిస్థితులలో దానిని పాటించడం సమస్యాత్మకమని ఆమె తెలిపారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







