భారత్, అఫ్ఘానిస్థాన్ ల సంబంధాల్లో మరో ముందడుగు..
- June 04, 2016
భారత్, అఫ్ఘానిస్థాన్ ల సంబంధాల్లో మరో ముందడుగు పడింది. భారత్-అఫ్ఘానిస్థాన్ ఫ్రెండ్ షిప్ డ్యామ్ ను ప్రారంభించారు. హెరాత్ లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనితో కలసి ఆవిష్కరించారు.ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈ రోజు మోదీ ఢిల్లీ నుంచి బయల్దేరి అఫ్ఘాన్ చేరుకున్నారు. హెరాత్ లో మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం ఘనితో కలసి మోదీ భారత్-అఫ్ఘానిస్థాన్ ఫ్రెండ్ షిప్ డ్యామ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. అప్ఘాన్ పురోభివృద్ధిలో ఇది మరో ముందడుగు అని అన్నారు. గతేడాది డిసెంబర్ లో కాబుల్ లో అఫ్ఘాన్ పార్లమెంట్ భవనం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు.ఈ డ్యామ్ ను ఇరు దేశాల స్నేహబంధం, విశ్వాసంతో నిర్మించినదని పేర్కొన్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోదీ అఫ్ఘాన్ తో పాటు స్విట్జర్లాండ్, మెక్సికో, ఖతార్, అమెరికా దేశాలకు వెళతారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







