దుబాయ్ పోలీస్ - రమదాన్ ట్రాఫిక్ అలర్ట్
- June 04, 2016
రమదాన్ సందర్భంగా రోడ్లపై ప్రమాదకర రీతిలో వాహనాలు నడిపేవారిపై వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయ్ పిలుపునిచ్చారు. నిబంధనల్ని అతిక్రమించి వాహనాలు నడిపేవారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. గత రమదాన్ సమయంలో 201 ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరిగాయనీ, ఈ ప్రమాదాల్లో 10 మంది మృతి చెందగా, 147 మంది గాయపడ్డారని ఆయన వివరించారు. 8004353 నెంబరుకి కాల్ చేసి ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయొచ్చన్నారు. రోడ్లపై భద్రతకుగాను ప్రత్యేక టీమ్‌లు పనిచేస్తాయనీ, ముఖ్యమైన సమయాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామని వివరించారు. ప్రధాన రోడ్లపైనా ఇంటర్నల్ రోడ్లపైనా పోలీస్ పెట్రోల్స్ కొనసాగుతాయని కల్నల్ మజ్రోయ్ చెప్పారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







