సర్ప్రైజింగ్ రోల్లో బేబమ్మ.!
- March 16, 2024మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పంజాకీ, అందాల భామ కృతి శెట్టికీ తొలి సినిమా అయిన ‘ఉప్పెన’ ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. కోవిడ్ టైమ్‌లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఈ సినిమాతో బేబమ్మగా కృతి శెట్టి కుర్రోళ్ల హుృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.
అంతేకాదు, టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది కూడా. కానీ, కాలం కలిసి రాలేదు. తొలి సినిమా తప్ప.. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయ్.
దాంతో, ఐరెన్ లెగ్ ట్యాగ్ వేసేసి.. అమ్మడిని టాలీవుడ్ పక్కన పెట్టేసింది. దాంతో బేబమ్మ గ్యాప్ తీసుకుంది. తాజాగా శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న ‘మనమే’ సినిమాతో మళ్లీ బేబమ్మ కృతి శెట్టి టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.
ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్లో కృతి శెట్టిని చూసి అందరూ షాకయ్యారు. అందుకు కారణం.. ఈ సినిమాలో ఓ బిడ్డకి తల్లిగా కృతి శెట్టి కనిపించబోతోంది. ‘మనమే’ ఓ డిఫరెంట్ సెంటిమెంట్ మూవీలా కనిపిస్తోంది.
తండ్రీ కొడుకు సెంటిమెంట్‌తో రూపొందే సినిమాలా తోస్తోంది. ఈ మధ్య ఈ తరహా సెంటిమెంట్ సినిమాలు బాగానే వర్కవుట్ అవుతున్నాయ్. అలా ‘మనమే’ హిట్టయితే మళ్లీ బేబమ్మని టాలీవుడ్లో ఇంకొన్ని రోజులు గుర్తు పెట్టుకోవచ్చన్న మాటే.!
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్