ఝార్ఖండ్ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు

- March 19, 2024 , by Maagulf
ఝార్ఖండ్ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తెలంగాణ నూతన గవర్నర్ గా ఝార్ఖండ్ గవర్నర్ సీ.పీ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉంటే తమిళిసై తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ రెండింటికి ఆమె సోమవారం రాజీనామా చేశారు. దీంతో పుదుచ్చేరి ఎల్జీగా కూడా రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్ సభకు ఆమె పోటీ చేస్తారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో తిరునల్వేలి లేదా దక్షిణ చెన్నై పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఆమె ఉన్నారని తెలుస్తోంది. అందుకే గవర్నర్ పదవిని వదులుకున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా తమిళసై సౌందర్య రాజన్ తమిళ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో తూత్తుకుడి నియోజకవర్గం నుంచి తమిళసై పోటీచేసి ఓటమి పాలయ్యారు. డీఎంకే మహిళా నేత కనిమొళి 3.5 లక్షల ఓట్ల మెజారిటీతో ఆమెపై గెలుపొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com