వైజాగ్ బీచ్‌లో కూతురు క్లీంకారతో రామ్ చరణ్..
- March 19, 2024
విశాఖపట్నం: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక పక్క నటుడిగా తన కర్తవ్యం నిర్వర్తిస్తూనే, మరో పక్క తండ్రిగా కూడా తన డ్యూటీస్ ని చేస్తూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ తో వైజాగ్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో వైజాగ్ లో ఒక పక్క సముద్రం, మరో పక్క మెగా ఫ్యాన్స్ సంద్రం కనిపిస్తూ వచ్చింది. నేటితో అక్కడి షూటింగ్ పూర్తి అయ్యింది.
మళ్ళీ 21వ తారీఖు నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు. ఇది ఇలా ఉంటే, చరణ్ సతీమణి ఉపాసన తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ వేశారు. ఆ పోస్టులో రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లీంకారతో కలిసి వైజాగ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. మార్నింగ్ సన్‌రైజ్ ని చూస్తూ.. క్లీంకారతో పాటు చరణ్ కూడా చిన్నపిల్లాడిలా మారిపోయి ఆడుకున్నారు. ఈ వీడియో పోస్ట్ మెగా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కాగా రేపు మార్చి 20న బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కబోయే RC16 పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కాబోతుంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ టైటిల్ పై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







