సమాజంలో మత్తు పదార్థాలకు స్థానం లేదు: సీపీ తరుణ్ జోషి
- March 21, 2024
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రవాణా మరియు వినియోగం మీద ఉక్కు పాదం మోపుతామని కమిషనర్ తరుణ్ జోషి పేర్కొన్నారు.ఈ రోజు నేరెడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో *నిషేధిత డ్రగ్స్ కేసుల దర్యాప్తులో అనుసరించవలసిన విధానాల మీద రాచకొండ పోలీసు సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిది అని, డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ పేర్కొన్నారు. తెలిసీ తెలియక మత్తు పదార్థాల బారిన పడడం వల్ల యువత యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని, యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని కమిషనర్ అన్నారు. నిషేధిత డ్రగ్స్ వాడడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. నిషేధిత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సూచించారు. పలు రకాల సామాజిక మాధ్యమాలు, సినిమాల వంటి వాటిలో చూసి డ్రగ్స్ వాడడం పట్ల ఆకర్షణకు లోనయి పిల్లలు తమ జీవితం నాశనం చేసుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శిక్షణలో నేర్పించే అంశాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలని, NDPS చట్టం అమలు తీరు పట్ల దర్యాప్తు అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి అని సూచించారు. డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల మీద కేసులు నమోదు చేయాలని, NDPS చట్టం-1985 ప్రకారం దర్యాప్తు విధానాలను పాటించాలని, నేరస్తులకు గరిష్ఠ స్థాయి శిక్ష పడేలా చూడాలని అన్నారు. నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా ప్రమాదంలో పడుతోందని, డ్రగ్స్ సరఫరా వల్ల వచ్చే డబ్బు అంతిమంగా తీవ్రవాదానికి సహాయం చేస్తూ , దేశ అంతర్గత భద్రతను సవాలు చేస్తోందని పేర్కొన్నారు. *రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రవాణా మరియు వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.*
చెక్ పోస్టుల వద్ద క్రమం తప్పకుండా చేస్తున్న తనిఖీలతో పాటు, ప్రత్యేక ఎస్ఓటి బృందాలు ఏర్పాటు చేసి చేపడుతున్న ఆపరేషన్ల ద్వారా ఎన్నో గంజాయి, ఓపియం, హెరాయిన్ వంటి ఇతర నిషేధిత డ్రగ్స్ సరఫరా ముఠాలను పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలను అణచివేయాలని, వారి మీద పిడి చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల రవాణా మీద ఎన్నొ దాడులు చేస్తున్నామని, ఎంతో మందిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీపీ పేర్కొన్నారు. యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల అవగాహన కల్పించేలా కళాశాలల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ప్రతినిధి రంగనాథం, ఏసిపి సీసీఆర్బి రమేష్, ఐటీ సెల్ ఏసిపి నరేందర్ గౌడ్, ఇన్స్పెక్టర్లు, వివిధ రాచకొండ స్టేషన్ రైటర్లు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు