ఎన్నికల సమయంలో డబ్బులు లేకపోవడంతో ప్రచారం చేయలేకపోతున్నాం: రాహుల్
- March 21, 2024
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచార సమయంలో మా నేతలను ఎక్కడకూ పంపించలేకపోతున్నాం… విమాన ప్రయాణాలను పక్కన పెట్టాం… కనీసం రైలు టిక్కెట్లు కొనడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్, ఎన్నికల బాండ్ల అంశాలపై ఆయన మాట్లాడుతూ… తమ పార్టీని దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో డబ్బులు లేకపోవడంతో ప్రచారం కూడా చేయలేకపోతున్నట్లు తెలిపారు.
తమ పార్టీపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పాల్పడుతున్న నేరపూరిత చర్యకు పాల్పడుతున్నారన్నారు. మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజుల్లో బ్యాంకు ఖాతాలు పని చేయకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అన్నారు. తాము ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయడమంటే భారత ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమే అన్నారు. ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయిందన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు