ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో మృతి
- March 30, 2024
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ (48) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి డేనియల్ కు ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబీకులు వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యమంలోనే డేనియల్ బాలాజీ మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఆయన ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. ఆయన వడ చెన్నై, కాఖా కాఖా, వేట్టైయాడు విళయాడు తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులో టక్ జగదీశ్, ఘర్షణతో పాటు పలు దక్షిణాది సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. టీవీ సీరియళ్ల ద్వారా కెరీర్ ప్రారంభించిన డేనియల్.. ‘చిట్టీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, మలయాళంతో కలిపి దాదాపు 40 సినిమాల్లో నటించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!