ఐపీఎల్ టికెట్ల పై సైబర్ మోసాలు..
- March 30, 2024
ఐపీఎల్ ట్రెండ్ నడుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడాలని క్రికెట్ అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. ఐపీఎల్ నేరుగా చూసే ఛాన్స్ దొరికితే అసలు వదిలిపెట్టరు. అందులోనూ ఐపీఎల్ ఉప్పల్ స్టేడియంలో మన హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ జరుగుతుందంటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండలేరనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.
ఇదే ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు మాటేసి ఉన్నారు జాగ్రత్త.. ముఖ్యంగా ఐపీఎల్ టికెట్ల కొనుగోలుపై కన్నేశారు. ఆన్‌లైన్‌లో ఐపీఎల్ టికెట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వచ్చే ఏప్రిల్ 5న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ టికెట్లు అన్నీ క్లోజ్.. నిలిపివేసిన పేటీఎం:
ఇప్పటికే ఈ చెన్నై, హైదరాబాద్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు అన్ని అమ్ముడయ్యాయి కూడా. కానీ, సైబర్ నేరగాళ్లు ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి, ఆన్‌లైన్‌లో ఐపీఎల్ టికెట్లు అన్ని క్లోజ్ అవ్వడంతో విక్రయాలు మొత్తాన్ని పేటీఎం నిలిపివేసింది. అయినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్లు అంటూ మోసాలకు పాల్పడుతున్నారు.
క్యూఆర్ కోడ్స్ పంపించి ముఠా సభ్యులు డబ్బులు గుంజుతున్నారు. టికెట్ల కొనుగోలుపై డిస్కౌంట్ ఇస్తామంటూ ముఠాలు మోసాలు చేస్తున్నారని, తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఐపీఎల్ టికెట్ల అమ్మకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సైబర్ క్రైం రంగంలోకి దిగింది. ఆన్‌లైన్‌లో ఐపీఎల్ టికెట్ల అమ్మకాలను అసలు నమ్మోద్దని, లేదంటే మోసపోతారని క్రికెట్ అభిమానులను సైబర్ పోలీసులు అలర్ట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!