ప్రైవేట్ రంగానికి ఈద్ అల్ ఫితర్ సెలవుల ప్రకటన
- April 02, 2024
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులకు యూఏఈ ప్రభుత్వం అధికారిక సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 8( సోమవారం) ప్రారంభమవుతాయి. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. రమదాన్ 29 లేదా 30 రోజులు ఉంటుంది. ఇది చంద్రుని దృష్టిని బట్టి ఉంటుంది. ఈద్ అల్ ఫితర్ షవ్వాల్ మొదటి రోజున జరుపుకుంటారు.
రమదాన్ 30 రోజులు ఉంటే: ఈద్ సెలవులు ఏప్రిల్ 8 (రమదాన్ 29) ప్రారంభమై ఏప్రిల్ 12 (శుక్రవారం)(షవ్వాల్ 3) వరకు ఉంటాయి. శని-ఆదివారం వారాంతాల నేపథ్యంలో సెలవులు మొత్తం తొమ్మిది రోజులు అవుతాయి. అప్పుడు ఈద్ సెలవులు ఏప్రిల్ 6( శనివారం) నుండి ఏప్రిల్ 14 ఆదివారం వరకు ఉంటాయి.
రమదాన్ 29 రోజులు కొనసాగితే: నివాసితులు వారాంతంతో సహా ఆరు రోజులు సెలవు పొందుతారు. ఈద్ ఏప్రిల్ 8 (రమదాన్ 29) నుండి ఏప్రిల్ 11 (గురువారం) వరకు ఉంటుంది. శనివారం-ఆదివారం వారాంతాన్ని చేర్చినట్లయితే, అది మొత్తం ఆరు రోజులు సెలవులు వస్తాయి. అప్పుడు ఈద్ సెలవులు ఏప్రిల్ 6 (శనివారం) నుండి ఏప్రిల్ 11 (గురువారం) వరకు ఉంటాయి.
అంతకుముందు, యూఏఈ క్యాబినెట్ ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు ఈద్ అల్ ఫితర్ జరుపుకోవడానికి తొమ్మిది రోజుల బ్రేక్ పొందుతారు. అయితే ఎమిరేట్‌లోని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మూడు రోజుల వారాంతపు సెలవులు లభించడంతో షార్జాలో ఉన్నవారు 10 రోజుల సెలవులను పొందుతారు. మతపరమైన సెలవుదినం కోసం నివాసితులలో ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన