‘ఫ్యామిలీ స్టార్.! దిల్ రాజు హంగామా మామూలుగా లేదు.!
- April 02, 2024విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఈ వారం గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
అలాగే, ప్రమోషన్లు కూడా గట్టిగా నిర్వహిస్తున్నారు. తన ప్రతి సినిమానీ దిల్ రాజు బాగానే ప్రమోట్ చేస్తుంటారు. అయితే, ఈ సారి ఇంకాస్త ఎక్కువ చేస్తున్నారు.
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో సమానంగా ఆయన కూడా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ట్రెడిషనల్ వేర్ ధరించి చేసిన ప్రమోషన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
అలాగే, కొన్ని వేదికలపై హీరోతో కలిసి స్టెప్పులు ఇరగదీస్తున్నారు. ఇలా ఈ సినిమాని చాలా పర్సనల్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అవును మరి, ఎలాగైనా ఈ సినిమాతో మళ్లీ విజయ్ దేవరకొండకు మునుపటి వైభవం తీసుకురావాలన్న పట్టు మీదున్నారట ఆయన.
అంతేకాదు, ఓ ప్యాన్ ఇండియా సినిమా సైతం ఈ కాంబినేషన్లో రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై రాజుగారు అనౌన్స్ చేసేందుకు రెడీగా వున్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం