రామ్ చరణ్‌తో రష్మిక.?
- April 02, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన రష్మిక మండన్నా జత కట్టబోతోందట. ఏ సినిమా కోసం అంటారా.? ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఎంపికయిన సంగతి తెలిసిందే. అలాగే, ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం రష్మకను సంప్రదిస్తున్నారనీ తెలుస్తోంది.
ఇంతవరకూ రష్మిక, రామ్ చరణ్ కాంబినేషన్ సెట్ కాలేదు. ఈ సినిమాతో ఆ లోటు తీరిపోనుందేమో. అయితే, ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రావల్సి వుంది.
ప్రస్తుతం రష్మిక.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో రష్మికకు తిరుగులేని పాపులారిటీ వచ్చిన సంగతి తెలిసిందే.
సుకుమార్ శిష్యుడే బుచ్చిబాబు సన. సో, సుకుమారే రష్మికను రిఫర్ చేశారేమో రామ్ చరణ్ సినిమాకి. అయితే, ఓ స్పెషల్ సాంగ్ కూడా ఈ సినిమాలో వుండబోతోందనీ తెలుస్తోంది. ఆ సాంగ్‌తో పాటూ కొన్ని సెకన్ల నిడివి సన్నివేశాలుండొచ్చట. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.!
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







