టిల్లుగానికి అక్కడా బాగా వర్కువుట్ అయినట్లుంది.!
- April 02, 2024
సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ తెలుగు రాష్ర్టాల్లో బాగానే దూసుకెళ్తోంది. లో బడ్జెట్ సినిమానే కాబట్టి.. వసూళ్లు ఆశించిన విధంగా కాకపోయినా, ఫర్వాలేదనిపిస్తున్నాయ్.
నిర్మాతలు సేఫ్ జోన్లోనే వున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఓవర్సీస్లో ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కుతోందట. అక్కడ ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అనూహ్యమైన వసూళ్లు రాబడెుతోందట అక్కడ ‘టిల్లు స్క్వేర్’. విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు 2.8 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం.
ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే, ఈ సినిమాకి బాగానే గిట్టుబాటయినట్లుంది. మొదట ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్నా.. ఫైనల్గా టిల్లుగాడు సేఫ్.
మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఆధ్యంతం వినోదంతో పాటూ, అనూహ్యమైన కొన్ని ట్విస్టులు సినిమాకి బ్రేక్ ఈవెన్ అయ్యేలా చేశాయంటున్నారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







