అల్లు అర్జున్ సినిమా కోసం ఓ బడా నిర్మాణ సంస్థ వెయిటింగ్.!

- April 02, 2024 , by Maagulf
అల్లు అర్జున్ సినిమా కోసం ఓ బడా నిర్మాణ సంస్థ వెయిటింగ్.!

‘పుష్ప 2’ సినిమా తర్వాత ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ ఓ ప్యాన్ఇండియా సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఎప్పుడో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ జరిగింది. కానీ, ఇంతవరకూ పట్టాలెక్కలేదు. అయితే, ముందుగా కమిట్ అయిన ప్రాజెక్టులు (పుష్ప 2) పూర్తి చేశాకే ఈ భారీ ప్రాజెక్టుపై అల్లు అర్జున్ ఫోకస్ పెట్టబోతున్నారు.
త్వరలోనే ‘పుష్ప 2’ కంప్లీట్ కానుంది. ఆగస్టులో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్. కాగా, అట్లీ సినిమాని హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ 2లో నిర్మించేందుకు సిద్ధమవుతున్నారట.
అయితే, ఇంతవరకూ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో పెద్ద సినిమాలేమీ రూపొందింది లేదు. కానీ, ఈ బ్యానర్‌ని ఇంకాస్త ఎత్తుకు తీసుకెళ్లాలంటే ఓ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. అందుకే తన సినిమానే ఈ బ్యానర్‌లో రూపొందించాలనుకుంటున్నారట.
అయితే, మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోనుందట. ఆల్రెడీ ఆ విషయమై మంతనాలు కూడా జరుగుతున్నాయట. అదేంటో త్వరలో వెల్లడి కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com