కొలెస్ట్రాల్ అంత డేంజరా.?

- April 02, 2024 , by Maagulf
కొలెస్ట్రాల్ అంత డేంజరా.?

కొవ్వు పెరిగితే డేంజరే. కాదనడానికి ఏముంది. సర్వ రోగాలకూ అదే మూలం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షుగర్, బీపీతో సహా హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు సైతం కొలెస్ట్రాల్ కారణమవుతుంది.
నయా నాగరికతలో భాగంగా రకరకాల ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు ఈ కొలెస్ర్టాల్ పెరగడానికి కారణభూతమవుతున్నాయ్. అలాగే మారిన జీవన శైలి కూడా ఇందుకు పరోక్షంగా కారణమవుతోంది.
అయితే అన్ని రకాల ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ కొలెస్ర్టాల్‌కి కారణమవుతాయా.? అంటే, తరచూ తినే వారికి ఈ ముప్పు తప్పదని అంటున్నారు.
ఆయా ఫుడ్స్ తరచూ తినడం తగ్గించగలిగితే, కొలెస్ర్టాల్‌ని సైతం తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఫాస్ట్ ఫుడ్ ప్లేస్‌లో పండ్లు కూరగాయలను తినడం పెంచుకోవాలి. అలాగే నట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఇవి కొలెస్ర్టాల్ స్థాయిని తగ్గించేందుకు తోడ్పడతాయ్. వీటిలో కొలెస్ర్టాల్ తగ్గించే ప్రొటీన్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండడంతో శరీరానికి శక్తితో పాటూ, బ్యాడ్ కొలెస్ర్టాల్ ముప్పు కూడా తగ్గుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com