ప్రబాస్ సినిమాలో హీరోయిన్లు వీళ్లేనా.?

- April 03, 2024 , by Maagulf
ప్రబాస్ సినిమాలో హీరోయిన్లు వీళ్లేనా.?

ప్రబాస్ చేయబోయే ప్రాజెక్టుల్లో ‘స్పిరిట్’ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘యానిమల్’ తర్వాత సందీప్ నుంచి రాబోతున్న సినిమా ఇది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించేదెవరు.? అనే విషయమై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.
ప్రబాస్ సినిమా అంటే ఖచ్చితంగా ప్యాన్ ఇండియా సినిమానే. అందులో నో డౌట్. ముఖ్యంగా సందీప్ రెడ్డికి బాలీవుడ్‌లో మంచి క్రేజ్ వుంది. సో బాలీవుడ్ భామల్నే ఈ సినిమా కోసం ఎంచుకుంటాడన్న టాక్ వుంది.
అయితే, మరోవైపు ఈ సినిమాలో త్రిషను హీరోయిన్‌గా తీసుకోబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అలాగే, ఒక్క హీరోయిన్ కాదు, ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లకు ఈ సినిమాలో ఛాన్సుందని అంటున్నారు.
సో, త్రిష‌తో పాటూ మహానటి కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే ఓ బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ సైతం ఈ సినిమాలో భాగం కాబోతోందని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
చూడాలి మరి, ఇంకా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కావల్సి వుంది. ప్రస్తుతం ప్రబాస్ చేస్తున్న ‘కల్కి’ మూవీ పూర్తి కాగానే ‘స్పిరిట్’ మూవీ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com