200 కోట్లు ఎప్పుడు కొల్లగొడతావ్ విజయ్.?
- April 04, 2024
‘లైగర్’ సినిమా టైమ్‌లో విజయ్ దేవరకొండ చేసిన ఓవరాక్షన్ అనాలో.. ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో.. అదంతా ఆ సినిమా రిలీజయ్యాకా తీరిపోయింది. ఆ సినిమా రిజల్ట్ విజయ్‌నీ, ఆయన కెరీర్‌నీ అట్టర్ ఫ్లాప్ చేసేసింది.
ఆ తర్వాత చాలా చాలా కష్టపడ్డాడు మళ్లీ నిలదొక్కుకోవడానికి. ‘ఖుషి’ సినిమాని కష్టపడి నిలబెట్టే ప్రయత్నం చేసుకున్నాడు కానీ, సాధించలేకపోయాడు. ఇక ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో వస్తున్నాడు.
ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ. ఈ టైమ్‌లో ప్రమోషన్ల కోసం బాగానే కష్టపడుతున్నాడు విజయ్. అయితే, ‘లైగర్’ టైమ్‌లో 200 కోట్లు కొల్లగొట్టి చూపిస్తా.. అంటూ ప్రగల్భాలు పలికాడు విజయ్ దేవరకొండ.
ఆ మాటల్ని గుర్తు చేస్తూ ఓ వర్గం అభిమానులు విజయ్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారట. అవును నిజమే.. ‘200 కోట్లు కొల్లగొడతా..’ అని చెప్పడం తప్పు కాదు.. కానీ, కొట్టి చూపించలేకపోవడమే తప్పు. అయితే అప్పుడు సాధించలేనిది ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’తోనైనా విజయ్ సాధిస్తాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన