బ్లాక్‌ హెడ్స్‌ నుంచి ఉపశమనమిలా..

- June 30, 2015 , by Maagulf
బ్లాక్‌ హెడ్స్‌ నుంచి ఉపశమనమిలా..

సాధారణంగా టీనేజ్‌ అమ్మాయిలను ఎక్కువగా వేధించే సమస్య మొటిమలు. టీనేజ్‌లో వచ్చే హార్మోన్స్‌ అసమతుల్యత వల్ల ఈ మొటిమల సమస్య మొదలవుతూ ఉంటుంది. దీంతో అమ్మాయిలకు అందం సమస్యయే కాకుండా కొంతమందిలో మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అంతే కాదు ఈ మొటిమలు తగ్గగానే తరువాత ఏర్పడే మచ్చలు చాలా కాలం ముఖంపై ఉండిపోయి ముఖాన్ని నల్లగా మార్చేస్తుంది. ఈ నల్ల మచ్చలు పోవాలంటే కొన్ని బాదం గింజలను చిన్నచిన్న పలుకులుగా చేసి దానికి కొద్దిగా శెనగపించి చేర్చి స్క్రబ్‌లా చేసి ముఖానికి పటించి, ముని వేళ్లతో వలయాకారంగా రాయాలి. పసుపు ముఖ్యంగా ఈ నల్ల మచ్చలను పోగొట్టడంలో కీలకపాత్ర వహిస్తుంది. కొద్దిగా పసుపులో కొంచెం పుదీనా గుజ్జు కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిముషాలు అయిన తరువాత మెత్తని క్లాత్‌తో తుడిచేస్తే ముఖంపై బ్లాక్‌ హెడ్స్‌ తొలగిపోతాయి. పచ్చిపాలు ముఖానికి రాసి పది నిముషాలైనాక గోరువెచ్చని నీటితో కడిగేసుకున్నా బ్లాక్‌ హెడ్స్‌ తొలగిపోతాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com