సీఎం రేవంత్‌ రెడ్డికి తప్పిన ప్రమాదం..

- April 08, 2024 , by Maagulf
సీఎం రేవంత్‌ రెడ్డికి తప్పిన ప్రమాదం..

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ప్రమాదం తప్పింది. రేవంత్‌ రెడ్డి కాన్వాయ్ లోని ల్యాండ్‌ క్రూజర్‌ కారు టైర్‌ పంక్చర్‌ అయి పేలిపోయింది. కారు సడెన్‌గా ఆగిపోయింది. దీంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ నుంచి కొడంగల్‌ వెళ్తున్న సమయంలో వికారాబాద్‌ జిల్లా మన్నెగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్ లో వెళ్తున్న నాయకులకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పేలిన టైర్లు రిపేర్‌ చేయడంతో మళ్లీ కొడంగల్‌కు బయలు దేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com