‘కల్కి’.! ఇప్పుడీ ట్విస్ట్లేంది అశ్వినా.?
- April 08, 2024
ప్రబాస్-నాగ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ప్రచారం సర్క్యులేట్ అవుతోంది. ఇంట్రెస్ట్ అనాలా.? వద్దా.? మేం చెబుతాం అంటారా.? అదీ నిజమేలెండి.
అసలు మ్యాటర్ ఏంటంటే, ‘కల్కి’ లో బోలెడంత మంది ప్రముఖ నటీ నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నుంచి, విశ్వ నటుడు కమల్ హాసన్ వరకూ వివిధ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో.
అయితే, తాజాగా ఈ సినిమాలో విలన్‌కి సంబంధించిన విషయమొకటి సరికొత్త ప్రచారంగా ఊపందుకుంది. అదేంటంటే, ఇంతవరకూ మెయిన్ విలన్ కమల్ హాసన్ అన్న సంగతి తెలుసు. కానీ, కమల్ క్యారెక్టర్ జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే అన్నది తాజా ప్రచారం తాలూకు సారాంశం.
దాంతో, ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్ సర్ప్రైజింగ్గా వుంచారా.? అన్న అనుమానాలు వస్తున్నాయ్. ఆ సంగతి అటుంచితే, జూనియర్ ఎన్టీయార్, నాగార్జున, నాని తదితరులు ఈ సినిమాలో భాగం పంచుకోబోతున్నారన్న సరికొత్త ప్రచారం కూడా ఊపందుకుంది.
ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. రిలీజ్ టైమ్ బేరీజు వేసుకుని చూస్తే.. ఇక షూటింగ్ చేసే అవకాశమే వుండదు. నిర్మాణానంతర పనులు మాత్రమే పెండింగ్ వుండాల్సి వుంది. గట్టిగా చెప్పాల్సి వస్తే.. అవి కూడా పూర్తి కావల్సి వుంది. ప్రస్తుతం ప్రమోషన్లతో ‘కల్కి’ టీమ్ బిజీగా వుండి వుండాలి. మే 9న సినిమా రిలీజ్ డేట్ పక్కా అని టీమ్ గట్టిగా చెబుతోంది. ఈ టైమ్‌లో ఈ ట్విస్టులేందో చూడాలి మరి.
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!