బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడమెలా?

- April 08, 2024 , by Maagulf
బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడమెలా?

కొంతవరకూ శరీరానికి కొలెస్టాల్ అవసరం వుంటుంది. అందుకే శరీరంలోని కొలెస్ర్టాల్‌ని మంచి కొలెస్ర్టాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాలుగా విడదీసి చెబుతారు వైద్య పరిభాషలో. అయితే, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంతుండాలి.? అసలు దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి.? అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చెడు కొలెస్ట్రాల్‌ని ముందుగా గుర్తించకపోతే గుండె పోటు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ చెడు కొలెస్ర్టాల్ కారణంగా గండెకు రక్తాన్ని సరఫరా చేసే సిరల్లో బ్లాక్స్ ఏర్పడతాయ్. తద్వారా గుండెకు రక్తం పంపిణీ సక్రమంగా జరగదు. దాంతో గుండె పోటు వచ్చే ప్రమాదం వుంది.
అందుకే 40 ఏళ్లు దాటాకా అప్పుడప్పుడూ వైద్యుని వద్దకు వెళ్లి కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. బ్యాడ్ కొలెస్ర్టాల్ ఎప్పుడైనా సరే, 100 mg బై dl కంటే తక్కువగా వుండాలి. అంతకన్నా ఎక్కువ వుంటే ముప్పు తప్పదు.
ఈ కొలెస్ర్టాల్‌ని తగ్గించుకోవడానికి ఖచ్చితంగా జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
జంక్ ఫుడ్‌కి పూర్తిగా దూరంగా వుండాలి. ధూమపానం, మధ్యపానం అలవాట్లుంటే వాటిని మానేయాలి. ప్రతీరోజూ తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా శారీరక శ్రమ కల్గించాలి. టైమ్‌కి సరైన పోషకాహారం తీసుకోవడంతో పాటూ, నిద్ర సరిగ్గా వుండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. బ్యాడ్ కొలెస్ర్టాల్ సమస్య నుంచి కొంత బయటపడే అవకాశముంది. వీటితో పాటూ వైద్య చికిత్స కూడా అవసరమే సుమా.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com