బహ్రెయిన్ రాయల్ డిక్రీపై మానవ హక్కుల సంస్థ ప్రశంసలు
- April 10, 2024
బహ్రెయిన్: హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా జారీ చేసిన రాయల్ డిక్రీపై మానవ హక్కుల కోసం జాతీయ సంస్థ (NIHR) ప్రశంసలు కురిపించింది. అల్లర్లు మరియు క్రిమినల్ కేసులలో దోషులుగా తేలిన 1,584 మంది ఖైదీలకు క్షమాపణ ఇస్తూ.. హిజ్ మెజెస్టి యొక్క రజతోత్సవం, ఈద్ అల్ ఫితర్ సందర్భంగా డిక్రీని జారీ చేసారు. NIHR ప్రెసిడెంట్ అలీ అహ్మద్ అల్ డెరాజీ మాట్లాడుతూ.. బహ్రెయిన్ సమాజం యూనిటీని, స్థిరత్వాన్ని, ప్రజా ప్రయోజనాలను, వ్యక్తిగత మరియు పౌర హక్కులను పరిరక్షించడం, న్యాయ సూత్రాలకు కట్టుబడి ఉండటం, చట్టబద్ధత మరియు పరిరక్షణకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. బహ్రెయిన్ యొక్క విధానానికి అనుగుణంగా మానవ హక్కుల విలువలను ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. హిజ్ మెజెస్టి సింహాసనాన్ని అధిరోహించిన రజతోత్సవం, ఈద్ అల్ ఫితర్ సందర్భంగా రాయల్ డిక్రీని స్వాగతిస్తూ అల్ డెరాజీ ప్రసంగించారు. ఈ మానవతా చొరవకు, NIHR యొక్క బోర్డ్ ఆఫ్ కమీషనర్‌ల తరపున మెజెస్టికి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?