విజయ్ సరసన ఛాన్స్ కొట్టేసిన రవితేజ హీరోయిన్.?
- April 10, 2024‘భానుశ్రీ బోర్సె’.. ఈ మధ్య ఈ పేరు టాలీవుడ్లో తెగ వినిపించింది. ఎవరీ భానుశ్రీ.? అంటే ఇంతవరకూ ప్రేక్షకులకు పరిచయం కాలేదు. త్వరలోనే మాస్ రాజా రవితేజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.
మాస్ రాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోయే ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో హీరోయినే ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం షూటింగ్ దశలో వుందీ సినిమా. ఇంకా ఈ సినిమా రిలీజ్ కాకుండానే, అమ్మడి పేరు మార్మోగిపోతోంది.
అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ ముద్దుగుమ్మ మరో బంపర్ ఛాన్స్ కొట్టేసిందనీ తెలుస్తోంది. అదేంటంటే, రౌడీ స్టార్ కాదు కాదు, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ సినిమాలో భానుశ్రీ బోర్సె హీరోయిన్గా ఎంపికైందని ప్రచారం జరుగుతోంది.
విజయ్ దేవరకొండ, గౌతమ్ తీన్ననూరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం విజయ్ పోలీసాఫీసర్ గెటప్ వేయబోతున్నాడు. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా శ్రీలీలను అనుకున్నారు. కానీ, ఆ ప్లేస్లో ఇప్పుడు భానుశ్రీ బోర్సె పేరు వినిపిస్తోంది. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.!
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు