సందీప్ రెడ్డి ‘యానిమల్’ థియరీ.!
- April 10, 2024‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా, ప్రబాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి సంబంధించి ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం.. అన్న చందంగా అంచనాలు ఆకాశాన్నంటేలా చేస్తున్నారు.
‘యానిమల్’ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. మొదట్లో టాక్ అంతంత మాత్రంగా వచ్చినప్పటికీ, ‘యానిమల్’ కలెక్షన్లు బాగా రాబట్టింది.
దాంతో, ‘స్పిరిట్’పై అంచనాలు సహజంగానే వున్నాయ్. అంతేకాదు, ఈ సినిమాని ఇంకా స్టార్ట్ చేయకుండానే మా సినిమా అలా వుండబోతోంది.. ప్రబాస్‌ని ఇలా చూపించబోతున్నా.. అంటూ అభిమానుల్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా.
దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్ ద్వారా దాదాపు 150 కోట్ల వరకూ వసూళ్లు వచ్చేస్తాయట. ఇక, మిగిలినది సందీప్ రెడ్డి మార్కెటింగ్ స్కిల్స్‌తో ఈజీగా రాబట్టేస్తాడని ట్రేడ్ వర్గాల అంచనా.
అంతేకాదు, హీరోల్ని వాడడంలో సందీప్ రెడ్డి వంగా స్పెషల్ డాక్టరేట్ తీసుకున్నాడు. అలాంటిది ప్రబాస్లాంటి కటౌట్‌ని ఏ రేంజ్లో వాడబోతున్నాడో.. అని రకరకాల ప్రచారాలు సైతం ఇంట్రెస్టింగ్గా వినిపిస్తున్నాయ్.
సినిమాని ముందు నుంచే ప్రమోట్ చేయడానికి చాలా చాలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట సందీప్ రెడ్డి వంగా. ‘యానిమల్’ థియరీనే ఈ సినిమాకీ అప్లై చేయబోతున్నాడట. చూడాలి మరి, ఎన్ని సంచలనాలకు వేదికవుతందో ‘స్పిరిట్’.!
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు