ప్రతిష్టాత్మక స్పోర్ట్ అవార్డును అందుకున్న ప్రిన్స్ అబ్దుల్ అజీజ్
- April 11, 2024
లండన్: యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన స్పోర్ట్అకార్డ్ కన్వెన్షన్ సందర్భంగా సౌదీ ఒలింపిక్ మరియు పారాలింపిక్ కమిటీ (SOPC) చైర్మన్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ టర్కీ బిన్ ఫైసల్ ప్రతిష్టాత్మక స్పోర్ట్అకార్డ్ అవార్డును అందుకున్నారు.
ఈ వేడుకకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్, జాతీయ ఒలింపిక్ కమిటీల సంఘం (ANOC) అధ్యక్షుడు రాబిన్ ఇ. మిచెల్ సహా ప్రముఖులు హాజరయ్యారు. 2021లో UTS వరల్డ్ వర్చువల్ యూత్ ఫెస్టివల్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు గానూ SOPCకి ఈ అవార్డు లభించింది.ఇందులో 100కి పైగా అంతర్జాతీయ సంస్థలు మరియు వివిధ దేశాల నుండి 30,000 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ కృతజ్ఞతలు తెలుపుతూ.. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ల తిరుగులేని మద్దతు కారణంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?