పితృత్వం, IVF, గర్భస్రావం సెలవు: కంపెనీలలో తల్లిదండ్రులకు కోసం పాలసీలు
- April 11, 2024
యూఏఈ: యూఏఈలోని కంపెనీలు యువ తల్లిదండ్రుల అవసరాలను ఎక్కువగా పునరాలోచించి, తదనుగుణంగా వారి విధానాలను రూపొందిస్తున్నాయి. నెల రోజుల పితృత్వ సెలవును అందించడం నుండి IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చికిత్సలు, ప్రసవాల కోసం సెలవులు మంజూరు చేస్తున్నాయని ఫైన్ హైజీనిక్ హోల్డింగ్ యొక్క CEO జేమ్స్ మైఖేల్ లాఫెర్టీ తెలిపారు. పాలసీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఒకరిద్దరు ఉద్యోగులు సెలవును వినియోగించుకున్నారని చెప్పారు. అంతేకాకుండా, కంపెనీలో నాలుగు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, నెలకు ఒక రోజు రుతుస్రావం సెలవు, అలాగే IVF చికిత్స కోసం అవసరమైన వారికి కూడా సెలవు ల పాలసీలు ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులకు అందించే వార్షిక సెలవులకు ఇది అదనం అని పేర్కొన్నారు. VFS గ్లోబల్ అనేది ఈ సంవత్సరం ప్రారంభంలో GCCలోని తన ఉద్యోగులకు పెటర్నిటీ సెలవులను అందించడం ప్రారంభించిన మరొక సంస్థ. సంస్థ 2024 నుండి నాలుగు నెలల మెటర్నిటీ సెలవులని అందిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?