సునీల్ బాగున్నాడు.! కానీ, కామెడీ బాలేదు.!
- April 12, 2024
సునీల్ మంచి నటుడు.. అనే కన్నా.. మంచి టైమింగ్ వున్న కమెడియన్. మధ్యలో హీరోగా మారి సంచలనాలు కూడా సృష్టించాడు. కానీ, ఆ సక్సెస్‌ని నిలబెట్టుకోలేకపోయాడు.
తర్వాత ఏం చేయాలో తోచక, మళ్లీ ఇప్పుడిప్పుడే కామెడీ క్యారెక్టర్లు సైతం చేస్తున్నాడు. ఈ గ్యాప్‌లో పలు డిఫరెంట్ రోల్స్ ప్రయత్నించాడు.
తాజాగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాలో డిఫరెంట్ కామెడీ జోనర్ ప్రయత్నించాడు సునీల్. కొందరు సునీల్ కామెడీని కొత్తగా ఫీలవుతున్నారు ఈ సినిమాలో.
మరికొందరయితే, ఏంటీ సునీల్ ఇలాంటి చెత్త కామెడీ చేశాడు.? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే, సునీల్‌ని సరిగ్గా వాడలేకపోతున్నారన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు.
గతంలో మాదిరి మళ్లీ తన కామెడీ టైమింగ్‌ని బయటికి తీస్తే, సునీల్ నుంచి మంచి కామెడీ ట్రాక్‌ని ఎంజాయ్ చేయొచ్చు.. అని ఆయన అభిమానులు సూచిస్తున్నారు.
మరి, మన మేకర్లు సునీల్ టాలెంట్‌ని సక్రమంగా వినియోగిస్తే ఓ మంచి కమెడియన్, ఓ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఆడియన్స్‌కి తిరిగిచ్చేయొచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!







