మృణాళిని రవి.! ఇప్పుడైనా గుర్తిస్తారా..?
- April 12, 2024
‘గద్దలకొండ గణేష్’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందిగా.! పేరు మృణాళిని రవి. అధర్వకు జోడీగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలో క్యూట్‌గా కనిపించి మెప్పించింది.
కానీ, పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. తాజాగా ‘లవ్ గురు’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించింది. విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన ఈ చిత్రం లేటెస్ట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సెంటిమెంట్‌తో కూడిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. ముఖ్యంగా మృణాళిని పర్‌ఫామెన్స్‌కి మంచి మార్కులు పడుతున్నాయ్.
అన్నీ బాగుంటే, ఈ సినిమాతో మృణాళిని మళ్లీ టాలీవుడ్‌లో ఆఫర్లు దక్కించుకునే అవకాశం లేకపోలేదు. టాలీవుడ్‌కి హీరోయిన్ల కొరత వుండనే వుంది. మృణాళిని వంటి పర్‌ఫామెన్స్ ఓరియెంటెడ్ ముద్దుగుమ్మలకి తెలుగులో ఎప్పుడూ చోటుంటుంది. చూడాలి మరి, ‘లవ్ గురు’తో మృణాళిని దశ తిరుగుతుందేమో టాలీవుడ్‌లో.!
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!