హీరోయిన్లను తక్కువ చేసి చూడొద్దు.!
- April 12, 2024
సినిమా సక్సెస్, ఫెయిల్యూర్‌పై హీరో, హీరోయిన్లకు సమాన వాటా వుంటుంది. సక్సెస్ అయితే, క్రెడిట్ హీరోకిస్తారు. ఫ్లాప్ అయితే, హీరోయిన్ మీద తోసేస్తుంటారు.
ఐరెన్ లెగ్ అని ఈజీగా హీరోయిన్ల మీద ముద్ర వేసేస్తుంటారు. ఈ ధోరణి మారాలి.. అని అందాల భామ కృతి ససన్ తాజాగా వ్యాఖ్యానించింది.
ఈ సాంప్రదాయం సినీ ఇండస్ట్రీలో చాలా చాలా ఎక్కువ. ఈ ధోరణికి చరమ గీతం పాడాలి.. హిట్, ఫట్ అనేది ఇద్దరి మీదా ఖచ్చితంగా వుంటుంది. హీరోయిన్లను మాత్రమే తక్కువ చేసి చూస్తారెందుకు.? అని తన గొంతు గట్టిగా వినిపిస్తోంది కృతి సనన్.
గతంలోనూ ఈ తరహా చర్చలు పలువురు హీరోయిన్లు లేవదీశారు. కానీ, ఈ తీరు మాత్రం పూర్తిగా పోలేదనే చెప్పాలి. అంతేకాదు, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రొడ్యూసర్లు కూడా తక్కువ బడ్జెట్ కేటాయిస్తుంటారు.
అంత తేలికతనం హీరోయిన్లంటే..! అని ఆవేదన వ్యక్తం చేసింది కృతి సనన్. తాజాగా ‘క్రూ’ అనే సినిమాలో కృతి సనన్ నటించింది. తెలుగులో అప్పుడెప్పుడో ‘వన్ నేనొక్కడినే’, ‘దోచేయ్’ సినిమాల్లో నటించిన కృతి సనన్ మళ్లీ ‘ఆది పురుష్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది.
రెండు సార్లు ప్రయత్నించినా తెలుగులో కృతి సనన్ సక్సెస్ కాలేకపోతోంది. కానీ, బాలీవుడ్‌లో ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా చలామణీ అవుతోంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!







