హీరోయిన్లను తక్కువ చేసి చూడొద్దు.!
- April 12, 2024సినిమా సక్సెస్, ఫెయిల్యూర్‌పై హీరో, హీరోయిన్లకు సమాన వాటా వుంటుంది. సక్సెస్ అయితే, క్రెడిట్ హీరోకిస్తారు. ఫ్లాప్ అయితే, హీరోయిన్ మీద తోసేస్తుంటారు.
ఐరెన్ లెగ్ అని ఈజీగా హీరోయిన్ల మీద ముద్ర వేసేస్తుంటారు. ఈ ధోరణి మారాలి.. అని అందాల భామ కృతి ససన్ తాజాగా వ్యాఖ్యానించింది.
ఈ సాంప్రదాయం సినీ ఇండస్ట్రీలో చాలా చాలా ఎక్కువ. ఈ ధోరణికి చరమ గీతం పాడాలి.. హిట్, ఫట్ అనేది ఇద్దరి మీదా ఖచ్చితంగా వుంటుంది. హీరోయిన్లను మాత్రమే తక్కువ చేసి చూస్తారెందుకు.? అని తన గొంతు గట్టిగా వినిపిస్తోంది కృతి సనన్.
గతంలోనూ ఈ తరహా చర్చలు పలువురు హీరోయిన్లు లేవదీశారు. కానీ, ఈ తీరు మాత్రం పూర్తిగా పోలేదనే చెప్పాలి. అంతేకాదు, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రొడ్యూసర్లు కూడా తక్కువ బడ్జెట్ కేటాయిస్తుంటారు.
అంత తేలికతనం హీరోయిన్లంటే..! అని ఆవేదన వ్యక్తం చేసింది కృతి సనన్. తాజాగా ‘క్రూ’ అనే సినిమాలో కృతి సనన్ నటించింది. తెలుగులో అప్పుడెప్పుడో ‘వన్ నేనొక్కడినే’, ‘దోచేయ్’ సినిమాల్లో నటించిన కృతి సనన్ మళ్లీ ‘ఆది పురుష్’ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెట్టింది.
రెండు సార్లు ప్రయత్నించినా తెలుగులో కృతి సనన్ సక్సెస్ కాలేకపోతోంది. కానీ, బాలీవుడ్లో ప్రస్తుతం సక్సెస్ఫుల్ హీరోయిన్గా చలామణీ అవుతోంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు