తారకరాముడు బాలీవుడ్లో అడుగుపెట్టాడు.!
- April 12, 2024ఎన్టీయార్ ‘దేవర’ సినిమా షూటింగ్‌కి చిన్న బ్రేక్ ఇచ్చి బాలీవుడ్లో అడుగు పెట్టాడు. అక్కడ ఆల్రెడీ కమిట్ అయిన ‘వార్ 2’ ప్రాజెక్ట్ గురించి ఎన్టీయార్ డేట్స్ కేటాయించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హృతిక్ రోషన్ లీడ్ రోల్ పోషిస్తుండగా, ఎన్టీయార్ విలన్ రోల్ పోషిస్తున్నాడు. ఇద్దరి మధ్యా వచ్చే సీన్లు చాలా చాలా పవర్ ఫుల్‌గా వుండబోతున్నాయని గతంలోనే పలు హింట్లు ఇచ్చారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు బాలీవుడ్లో అడుగు పెట్టాడట ఎన్టీయార్. కాగా, ఈ సినిమాతో పాటూ, మరికొన్ని బాలీవుడ్ సినిమాల కోసం ఎన్టీయార్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయట ఈ నేపథ్యంలోనే.
షూటింగ్ గ్యాప్‌లోనే పలు ప్రాజెక్టులు చర్చకు వస్తున్నాయట. అంటే, ఎన్టీయార్ భవిష్యత్తులో మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 10న ఎన్టీయార్ నటించిన ‘దేవర’ రిలీజ్ కానుంది. ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు