విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఆ డైరెక్టర్ పైనే.!
- April 15, 2024
విజయ్ దేవరకొండ అంటేనే సెన్సేషనల్. కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయ్. విజయ్ ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు.
ఒక్క హిట్టు కూడా దక్కట్లేదు. తాజాగా వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయ్. కానీ, రిలీజ్ తర్వాత ఈ సినిమానీ తుస్మనిపించేశారు ఆడియన్స్.
ఎలాగైనా ఈ సినిమాతో హిట్టు కొట్టి నిలబడిపోవాలనుకున్నాడు. కానీ, కుదరలేదు. ఇక, ఇప్పుడు ఆశలన్నీ విజయ్ తదుపరి చిత్రంపైనే. తదుపరి చిత్రం ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో చేయాల్సి వుంది విజయ్ దేవరకొండ.
ఈ సినిమాని ఓ స్పై కాన్సెప్ట్‌తో రూపొందించబోతున్నాడు గౌతమ్ అని ప్రచారం జరుగుతోంది. అయితే, స్పై స్టోరీస్ తెలుగులో అంతగా ఆకట్టుకోలేదింతవరకూ.
ఇలాంటి టైమ్‌లో విజయ్ దేవరకొండతో ఆ కాన్సెప్ట్ అంటే కూసింత ఆలోచించాలేమో గౌతమ్.. అని సినీ మేథావులు సూచనలిస్తున్నారు. అయితే, ఈ సినిమాని గౌతమ్ చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడట. చూడాలి మరి. ఏం చేస్తాడో.!
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?