దుబాయ్: స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- April 15, 2024
దుబాయ్: దుబాయ్ లోని ఎతిసలాత్ అకాడమీలో స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పంచాంగ పఠనం రాజేష్ శర్మ చేసారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి ఉగాది పచ్చడి రుచి చూపించారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా నిజామాబాద్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ లీడర్ నంగి దేవేందర్ రెడ్డి, యూఏఈ బిజినెస్ మెన్,టీఆర్ఎస్ యూత్ లీడర్ సందీప్ పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు హోల్డర్ పవన్ శర్మ తన నృత్యంతో అందరిని అలరించారు. లెగ్స్ కిరణ్ తన కామెడీ తో అందరిని ఆనందింప చేశారు.
చిన్నారులు ఆటపాటలతో ఉర్రూతలూగించారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ.. అందరికీ మంచిజరగాలని కోరుకున్నారు. అనంతరం వివిధ విభాగాల్లో పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ప్రత్యేకమైన వంటకాలతో ఉగాది భోజనాల చేసి.. అందరూ సంబరాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి మాగల్ఫ్ న్యూస్ మరియు లెమన్ స్టూడియో మీడియా పార్ట్నర్లుగా వ్యవహరించారు.ఉషశ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ కార్యక్రమంలో తోట రాం కుమార్(చైర్మన్ బిల్డింగ్ మెటీరియల్స్), మసియుద్దీన్ మహమ్మద్( ఫౌండింగ్ మెంబెర్ తెలుగు అసోసియేషన్), రాజు,రమేష్(మేనేజింగ్ డైరెక్టర్ లెమన్ స్టూడియో), శ్రీకాంత్ చిత్తర్వు(ఎడిటర్-ఇన్-చీఫ్ మాగల్ఫ్ న్యూస్), అశోక్ కుమార్, మల్లేష్ కోరేపు,రవి కటకం(ప్రెసిడెంట్ (గత్వక్) తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి స్పార్క్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సుర్నిదా మరియు లావణ్య ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?