జగన్‌పై రాయి దాడి..నిందితులను పట్టిస్తే రూ.2 లక్షల రివార్డు!
- April 15, 2024
అమరావతి: విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై కొందరు ఆగంతుకులు రాయితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇక ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. నిందితుల గురించి తమకు సమాచారం అందిస్తే రూ. 2 లక్షలు ఇస్తామన్నారు. అలాగే తమకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఇదిలాఉంటే.. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి ఎలా జరిగింది? ఎయిర్ గన్‌తో ఏమైనా దాడి చేశారా? లేదంటే క్యాట్‌బాల్‌తో కొట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పాఠశాలకు, గుడికి మధ్య ఖాళీ ప్రదేశం నుంచి దాడి జరిగినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?