పంట రుణాల మాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

- April 16, 2024 , by Maagulf
పంట రుణాల మాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

హైదరాబాద్: పంట రుణాల మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. రుణమాఫీకి సంబంధించి నాదీ బాధ్యత అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ”ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తా. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా రుణాలు మాఫీ చేయలేదు. ఇక వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు.

”నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం. లక్షా 30వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం. మేము కాంట్రాక్టర్లకో, జమిందార్లకో టికెట్ ఇవ్వలేదు. బీసీలు, సామాన్య కార్యకర్తలకు టికెట్లు ఇచ్చి గెలిపించాం. రజకుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యారు. మక్తల్ లో ముదిరాజ్ బిడ్డకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం. ముదిరాజ్ బిడ్డలకు కేసీఆర్ ఒక్క టికెట్ అయినా ఇచ్చారా? కేసీఆర్ నిర్లక్ష్యానికి ముదిరాజులు నష్టపోయారు. ఆరు గ్యారంటీల్లో 5 అమలు చేస్తున్నాం. యావత్ దేశమే తెలంగాణవైపు చూస్తోంది. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. పార్టీ నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యత ఇస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com