మాస్ రాజా రవితేజ కొత్తేపారం.!
- April 16, 2024
సినిమాలు చేస్తూనే ఇతరత్రా కమర్షియల్ బిజినెస్‌లలోనూ పెట్టుబడులు పెడుతుంటారు సెలబ్రిటీలు. హీరోయిన్లు రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్, సమంత.. ఇలా పలువురు ముద్దుగుమ్మలు సినిమాల్లో సంపాదించిన డబ్బును రెస్టారెంట్ బిజినెస్ అనీ, ఫిట్‌నెస్ బిజినెస్ అనీ.. ఇలా పలు రకాల బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టి ఆదాయం ఆర్జిస్తున్నారు.
హీరోల విషయానికి వస్తే, మహేష్ బాబు ఏషియన్ కంపెనీతో కలిసి ఏఎంబీ, అల్లు అర్జున్ ఏఏఏ.. విజయ్ దేవరకొండ ఓ వైపు తన బ్రాండ్ బట్టల దుకాణంతో పాటూ, ఏషియన్ కంపెనీతో కలిసి మల్టీఫ్లెక్స్ బిజినెస్‌లోనూ ఆదాయం ఆర్జిస్తున్నారు.
తాజాగా ఈ లిస్టులోకి మాస్ రాజా రవితేజ కూడా చేరిపోయారు. ఏషియన్ కంపెనీతో కలిసి రవితేజ కూడా ధియేటర్ల బిజినెస్‌లో అడుగుపెడుతున్నారు. దిల్‌సుఖ్ నగర్‌లో ఏషియన్ కంపెనీతో కలిసి రవితేజ ఏఆర్టీ మల్టీఫ్లెక్స్ నిర్మాణానికి రెడీ అవుతున్నారు. ఆరు స్క్రీన్లతో సిద్ధం కాబోతున్న ఈ ధియేటర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయట.
అన్నట్లు ఆల్రెడీ రవితేజ నిర్మాణంలోనూ భాగం పంచుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025