ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్..
- April 18, 2024హైదరాబాద్: టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్.. సినిమాలు, వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. విజయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న వస్తున్న ఈ హీరో గత ఏడాది.. ఏకంగా ఇది చిత్రాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఇటీవల ‘CSI సనాతన’ సినిమాతో మంచి రివ్యూలనే అందుకున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ఆది సాయి కుమార్.. తాజాగా మరో సినిమా స్టార్ట్ చేసారు.
అదికూడా సూపర్ హిట్ కాంబోని రిపీట్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. గతంలో తనకి ‘చుట్టలబ్బాయ్’ సినిమాతో మంచి విజయాన్ని అందించిన దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో కలిసి మరో సినిమాని తీసుకు రాబోతున్నారు. చుట్టలబ్బాయ్ మూవీ లాగానే ఈ చిత్రం కూడా విలేజ్ డ్రామాతో ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీతో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందట.
ఇక ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నేడు ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసారు. దిల్ రాజు, అనిల్ రావిపూడి, సాయి కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ పై తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లాంచ్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!